Jagdeep Dhankhar: 2 నెలల తర్వాత రాష్ట్రపతి భవన్‌లో జగదీప్ ధన్‌ఖర్ ప్రత్యక్షం

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ఏమయ్యారంటూ ప్రతిపక్షం ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా లేఖలు రాసింది. జగదీప్ ధన్‌ఖర్ సమాచారం ఇవ్వాలని కోరింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారాన్ని కేంద్రం ఇవ్వలేదు. తాజాగా జగదీప్ ధన్‌ఖర్ రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యక్షమయ్యారు. శుక్రవారం 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతులంతా హాజరయ్యారు. ఇందులో జగదీప్ ధన్‌ఖర్ దంపతులు కూడా హాజరయ్యారు. వెంకయ్యనాయుడు పక్కనే జగదీప్ ధన్‌ఖర్ దంపతులు కనిపించారు. దాదాపు 2 నెలల తర్వాత మాజీ ఉప రాష్ట్రపతి కనిపిండంతో సస్పెన్ష్‌కు తెర పడింది.
జూలై 21న జగదీప్ ధన్‌ఖర్ అనూహ్యంగా ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య సమస్యలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతికి లేఖ పంపించారు. అప్పటి నుంచి మళ్లీ ఎప్పుడు జగదీప్ ధన్‌ఖర్ ప్రత్యక్షంగా కాలేదు. దీంతో జగదీప్ ధన్‌ఖర్ జాడ తెలియజేయాలంటూ శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రానికి రాశారు. కానీ ఎలాంటి సమాచారం అందజేయలేదు. అప్పటినుంచి సస్పెన్ష్‌గానే ఉంది. తాజాగా శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యక్షం కావడంతో ఉత్కంఠకు తెరపడింది.
వాస్తవంగా జగదీప్ ధన్‌ఖర్ పదవీ కాలం ఆగస్టు 10, 2027లో ముగియనుంది. కానీ అనూహ్యంగా రెండేళ్ల ముందే పదవి నుంచి తప్పుకున్నారు. కేంద్రంతో సరైన సంబంధాలు లేనందునే ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి కాలం ఉప రాష్ట్రపతిగా ఉండకుండానే పదవి నుంచి వైదొలిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com