Jagdeep Dhankhar: ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్ నామినేషన్..

Jagdeep Dhankhar: ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్ నామినేషన్ వేశారు. స్వయంగా ప్రధాని మోదీ వెంట వెళ్లారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంతోమంది పేర్లు వినిపించినప్పటికీ.. అనూహ్యంగా బెంగాల్ గవర్నర్ పేరును ప్రకటించింది బీజేపీ. ముఖ్యంగా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, కర్నాటక గవర్నర్ థావర్‌చంద్ పేర్లు వినిపించాయి.
కాని, శనివారం నాటి సమావేశంలో జగదీప్ ధన్‌కర్ పేరు ఫైనల్ చేశారు. ఎన్డీయే సంఖ్యాబలం నేపథ్యంలో జగదీప్ గెలుపు సులభమని విశ్లేషకులు చెబుతున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో 780 మంది సభ్యులుండగా.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు మేజిక్ ఫిగర్ 391 ఓట్లు కావాలి. ఎన్డీయేలోని మిత్రపక్షాలను మినహాయించినా.. బీజేపీకే 394 మంది సభ్యులున్నారు. ఇక బీజేపీ మిత్రపక్షాలు, మద్దతుదారుల ఓట్లతో జగదీప్‌కు భారీ మెజారిటీ ఖాయమని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com