Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖడ్..

Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖడ్..
X
అనారోగ్య కారాణాలతో పదవికి రాజీనామా

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ (74) రాజీనామా చేశారు. అనారోగ్య కారాణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. 2022, జులై 16న ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్‌ ఎన్నికయ్యారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఇక రాజీనామా లేఖలో ప్రధాని మోడీకి, రాష్ట్రపతికి ధన్‌ఖడ్‌ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం రాజీనామా వెంటనే అమలులోకి వస్తుంది.

వైద్యుల సలహా మేరకు రాజీనామా చేసినట్లు వెల్లడించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం భారత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఇది వెంటనే అమలులోకి వస్తుందని ఉపరాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన లేఖలో ధన్‌ఖడ్ పేర్కొన్నారు.

ధన్‌ఖడ్ 1951, మే 18న జన్మించారు. 1978–1979 కాలంలో రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు. 2019–2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1989–1991 కాలంలో లోక్‌సభ సభ్యుడిగా పని చేశారు. 1990-91 మధ్య కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. సోమవారం ప్రారంభమైన సమావేశాలకు రాజ్యసభ ఛైర్మన్‌గా ధన్ ఖడ్ సభకు హాజరయ్యారు. అనూహ్యంగా సాయంత్రానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై అనేకమైన వదంతులు వినిపిస్తున్నాయి. మోడీ ప్రభుత్వానికి మేలు చేసేందుకే రాజీనామా చేశారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారని అంటున్నారు. బీహార్ వ్యక్తికి ఉప రాష్ట్రపతి పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరో రెండేళ్లు పదవి ఉండగా ఇంత సడన్‌గా ఎందుకు రాజీనామా చేశారంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి.

Tags

Next Story