Jagdeep Dhankhar: ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్ ప్రమాణ స్వీకారం..

Jagdeep Dhankhar: భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్ బాధ్యతలు స్వీకరించారు. ధన్‌ఖఢ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు రాజ్ ఘాట్‌లో మహత్మ గాంధీకి నివాళులర్పించారు జగదీప్ ధన్‌ఖడ్.
ఇటీవల జరిగిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన జగదీప్ ధన్‌ఖడ్...విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరేట్ అల్వాపై విజయం సాధించారు. రాజస్థాన్ ఓబీసీ జాట్ సామాజిక వర్గానికి చెందిన ధన్‌ఖడ్..మూడు దశాబ్ధాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగారు. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2019 నుంచి మొన్నటి వరకు బెంగాల్ గవర్నర్‌గా పని చేశారు.
రాజస్థాన్ నుంచి ఉపరాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన రెండో వ్యక్తిగా జగదీప్ ధన్‌ఖడ్ రికార్డులకెక్కారు. అంతకు ముందు బైరాన్ సింగ్ షెకావత్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న ఓం బిర్లా కూడా రాజస్థాన్‌కు చెందిన వారే. దీంతో ఉభయ సభల అధిపతులు రాజస్థాన్‌కు చెందిన వారే అవుతారు. రాజ్యసభ ఛైర్మన్‌గా పెద్దల సభను నడిపించనున్నారు జగదీప్ ధన్‌ఖడ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com