Jaishankar: ఇరాన్ మంత్రి అబ్బాస్ అరఘ్చికి జైశంకర్ ఫోన్..

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితో కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ ఫోన్‌లో మాట్లాడారు. తాజా పరిణామాలపై ఇరాన్‌తో చర్చించినట్లుగా ఎక్స్‌లో జైశంకర్ పేర్కొన్నారు.
మధ్యప్రాచ్యంలో కీలక భాగస్వాములతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ కృషి చేస్తోంది. ప్రతి దేశానికి సంయమనం, దాడులను ఆపడం, చర్చలు కొనసాగించడం అత్యంత అవసరమని భారత్ అభిప్రాయపడింది. సంక్షోభం మరింత పెరగకుండా చర్చలు అవసరం అని భారత్ పేర్కొంది. అన్ని పక్షాలూ సంయమనం ప్రదర్శించవలసిన అవసరం ఉందని.. మానవికతను కాపాడేందుకు పని చేయాలని భారత్ కోరింది. భారత ప్రభుత్వం దౌత్యాన్ని, చర్చలను ప్రోత్సహించే దిశగా వెళ్తుందని తెలిపింది.
ఇరాన్ వెనక్కి తగ్గకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు. అంతేకాకుండా అమెరికా రక్షణ కార్యదర్శి హీట్ హెగ్సేత్ కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు చూడని అత్యంత తీవ్రమైన దాడులు చేస్తామని సూచించారు. మరోవైపు ఇజ్రాయెల్.. లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో పరిస్థితులు తీవ్రంగా నడుస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
