JK Assembly: పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం

JK Assembly: పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం
X
బాధిత కుటుంబాలకు శాసనసభ సంఘీభావం

పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం సురిందర్ చౌదరి తీర్మానం ప్రవేశపెట్టారు. ముక్తకంఠంతో శాసనసభ ఉగ్రదాడిని ఖండించింది. అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఘటన దారుణం అని సభ పేర్కొంది. పిరికి చర్యగా అభివర్ణించింది. బాధితులకు, వారి కుటుంబాలకు సభ సంఘీభావం తెలిపింది. ఇక పర్యాటకులను రక్షించడానికి ధైర్మంగా ముందుకొచ్చి ప్రాణాలు అర్పించిన షహీద్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్‌ త్యాగానికి సభ వందనం చేసింది.

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. అంతేకాకుండా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు మూసివేసింది. తాజాగా పాక్‌కు సంబంధించిన 16 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది. ఇలా ఒక్కొక్కటిగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక ఉగ్ర దాడులకు పాల్పడ్డ నిందితుల సమాచారం అందిస్తే రూ.20లక్షల రివార్డ్ ప్రకటించింది. గత మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్ది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారు ఉండడం బాధాకరం.

Tags

Next Story