Snowfall: జమ్ముకశ్మీర్‌లో భారీగా మంచు వర్షం..

జమ్ము కశ్మీర్‌లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. బారాముల్లా, సోనమార్గ్, బందిపోర సహా అనేక ప్రాంతాల్లో మంచు పడుతుంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో క్రమంగా మంచు కురుస్తునే ఉంది. రోడ్లు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలు, ఎత్తైన కొండలపై పడుతున్న మంచు దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మంచు వర్షాన్ని స్థానిక ప్రజలు, పర్యాటకులు బాగా ఆస్వాదిస్తున్నారు.
అయితే, సాధారణంగా శీతాకాలంలో జమ్ముకశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. మంచు తెరలతో కశ్మీర్ లోయలు, కొండల అందాలను వీక్షించేందుకు భారతదేశం నలుమూలల నుంచేగాక, విదేశాల నుంచి కూడా టూరిస్టులు భారీగా వస్తుంటారు. మంచు వర్షానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మరోవైపు భారీగా మంచు పడుతుండటంతో శ్రీనగర్ సహా ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు మైనస్ 1 డిగ్రీలకు దిగజారింది. దీంతో చలి తీవ్రతకు కశ్మీర్ ప్రజలు జంకుతున్నారు. చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com