Jammu Kashmir: ఉధంపూర్‌లో రోడ్డు ప్రమాదం.. సీఆర్‌పీఎఫ్ జవాన్ సహా నలుగురు మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో మంగళవారం బస్సు ఆగి ఉన్న రోడ్డు క్యారియర్‌ను, మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సిఆర్‌పిఎఫ్ జవాన్ సహా నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై జఖాని-చెనాని ప్రాంతం సమీపంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. దోడా నుండి జమ్మూకు వెళ్తున్న బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టాడని, ఆ తర్వాత లోడ్ క్యారియర్‌ను ఢీకొట్టాడు. దాంతో క్యారియర్‌లో కొంత లోపం ఏర్పడిందని, దానిని మెకానిక్ మరమ్మతు చేస్తుండగా ప్రమాదం జరిగిందని వారు తెలిపారు.
ఈ ప్రమాదంలో మెకానిక్ మరియు లోడ్ క్యారియర్ డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా, బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అత్యవసర కిటికీలోంచి బయటకు దూకడంతో గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని అధికారి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
