Prashant Kishor: బిహార్ ఓ విఫల రాష్ట్రం.. జన్ సురాజ్ పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు

జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ బిహార్ అభివృద్ధిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్‌ను “ఫెయిల్యూర్ స్టేట్”గా అభివర్ణించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడపాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలోని బీహారీ ప్రవాసులతో వర్చువల్ సమావేశం అయ్యారు. బీహార్ రాష్ట్రం తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది.. ఒకవేళ బీహార్ ఒక దేశమైతే.. జనాభా పరంగా ప్రపంచలోనే 11వ అతి పెద్ద దేశమవుతోందని చెప్పుకొచ్చారు. జనాభాపరంగా జపాన్ దేశాన్ని దాటేసింది.. అయితే, ప్రత్యక్షమైన పాలనా ఫలితాలను సాధించడానికి నిరంతర కృషి అవసరమని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.
ఇక, 2025లో జన్ సూరాజ్ ప్రభుత్వాన్ని ఏర్పడితే.. తమ తొలి ప్రాధాన్యత పాఠశాల విద్యను అభివృద్ధి చేస్తామని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. బీహార్ అభివృద్ధిపై తన అభిప్రాయాన్ని చెప్పారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తివేయాలని సూచించాగా.. ఆ నియమం వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది.. బీహారీ ప్రవాసులు కేవలం చర్చలకే పరిమితం కాకుండా రాష్ట్ర అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. కాగా, ఉప ఎన్నికల్లో తమ పార్టీ పేలవమైన ప్రదర్శన కనబర్చినప్పటికీ.. పార్టీ భవిష్యత్ పై ఆశాజనకంగానే ఉన్నాం.. 2025లో జన్ సూరాజ్ విజయం సాధిస్తుంది. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు.. నాకున్న అవగాహన ప్రకారం.. మా పార్టీ పక్కా గెలుస్తుందని చెప్పగలను.. 2029-2030 నాటికి బిహార్‌ను మధ్య-ఆదాయ రాష్ట్రంగా మార్చడం ఒక ముఖ్యమైన సవాలు అని వెల్లడించారు. అంకితభావంతో పని చేస్తే ఏదైనా సాధించగలమని జన్ సూరాజ్ పార్టీ అధినేత కిషోర్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com