Jaya Verma Sinha: రైల్వే బోర్డుకు తొలి మహిళా సీఈవో

రైల్వేబోర్డు ఛైర్మన్ గా తొలిసారి మహిళకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం( centre) కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేబోర్డు ఛైర్ పర్సన్( first woman CEO and Chairperson of the Railway Board) గా జయవర్మ సిన్హా(Jaya Verma Sinha)ను నియమిస్తూ ఉత్వర్వులు జారీచేసింది. IRMS అధికారి జయవర్మ సిన్హా సుమారు 3వందల మృతి చెందిన బాలేశ్వర్ రైల్వే దుర్ఘటనకు సంబంధించి క్లిష్టమైన సిగ్నలింగ్ వ్యవస్థపై వివరించారు. సెప్టెంబర్ 1 నుంచి 2024 ఆగస్టు 31వ తేదీ వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జయవర్మ సీఈవోగా కొనసాగనున్నారు. రైల్వే బోర్డు సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళా అధికారి జయవర్మనే కావడం విశేషం. నేటి వరకు రైల్వే బోర్డు సీఈవోగా అనిల్ కుమార్ లహాటీ కొనసాగారు.
అలహాబాద్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన జయావర్మ 1988లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో చేరారు. ఉత్తర, ఆగ్నేయ, తూర్పు రైల్వే జోన్‌లలో ఆయా హోదాల్లో విధులు నిర్వహించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని భారత హైకమిషన్‌లో రైల్వే సలహాదారుగా నాలుగేళ్లపాటు పనిచేశారు. ఆ సమయంలోనే కోల్‌కతా నుంచి ఢాకాకు ‘మైత్రీ ఎక్స్‌ప్రెస్’ ప్రారంభమైంది. జూన్‌లో ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని వివరించడం ద్వారా జయావర్మ మీడియాలో నిలిచారు. వాస్తవానికి ఆమె అక్టోబర్ 1న పదవీ విరమణ చేయనున్నారు. అయితే, ఆమె పదవీ కాలం ముగిసే వరకు అదే రోజు తిరిగి ఉద్యోగంలో చేరనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com