Jayalalitha Report: సీఎం స్టాలిన్ చేతికి జయలలిత మృతిపై తుది నివేదిక..

Jayalalitha Report: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరిపిన జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ తుది నివేదికను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు అందజేసింది. మూడు వాల్యూములలో ఈ నివేదికను అందించింది. ఇంగ్లీష్‌లో 500 పేజీలు, తమిళంలో 608 పేజీలు ఉంది. రేపు జరిగే కేబినెట్ భేటీలో దీనిపై చర్చించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అప్పటి డీఎంకే ప్రభుత్వం అర్ముగస్వామి కమిషన్‌ను 25 సెప్టెంబరు 2017లో ఏర్పాటు చేసింది.
కమిషన్ కాలపరిమితి ఈనెల 24తో ముగిసింది. అంతకుముందు పలుమార్లు ప్రభుత్వం ఈ కమిషన్ కాలపరిమితిని పొడిగించింది. విచారణ కోసం గత ప్రభుత్వం తమకు పూర్తిగా సహకరించిందని అర్ముగస్వామి తెలిపారు. అలాగే, ఎలాంటి జోక్యం కూడా చేసుకోలేదని పేర్కొన్నారు. తానైతే రిపోర్టును అందజేశానని, దానిని విడుదల చేయాలా? వద్దా? అనేది ప్రభుత్వ నిర్ణయమని పేర్కొన్నారు. 13 నెలల్లోనే విచారణ పూర్తచేసిన కమిషన్.. మొత్తం 149 మంది సాక్షులను విచారించింది.
జాప్యం జరిగిందన్న ఆరోపణలు కొట్టిపడేసిన జస్టిస్ అర్ముగస్వామి.. విచారణలో అపోలో ఆసుపత్రితోపాటు జయలలిత నెచ్చెలి వీకే శశికళ కూడా పూర్తిగా సహకరించారని పేర్కొన్నారు. విచారణ సమయంలో జయలలిత నివాసాన్ని ఎందుకు సందర్శించలేదన్న విమర్శలపై అర్ముగస్వామి స్పందిస్తూ.. జయను ఆసుపత్రికి తరలించే సమయంలో అనామానాస్పదంగా ఏదీలేదని స్పష్టం చేశారు. ఆమె ఆరోగ్యం, అలవాట్లు, తీసుకునే శ్రద్ధ, ఆమె బాగోగులు ఎవరు చూసుకునేవారు వంటివాటిపైనా దర్యా
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com