Cinematic Bank Robbery: బ్యాంక్‌లో రూ.2 కోట్లు దోచుకున్న వైనం!

Cinematic Bank Robbery:   బ్యాంక్‌లో రూ.2 కోట్లు దోచుకున్న వైనం!
X
తుపాకీలతో బెరించి.. అడ్డుకున్న వాళ్లపై దాడి చేసి

వీళ్లు మామూలు దోపిడి చేయలేదు అయ్యా.. నిజంగా సినిమా లెవల్ దోపిడి చేశారు. ఇంతకీ ఈ దొంగల ముఠా ఎక్కడ దోచుకున్నారని అనుకుంటున్నారు.. సోమవారం జార్ఖండ్ రాష్ట్రంలోని డియోఘర్ జిల్లా నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధుపూర్‌లోని HDFC బ్యాంకు కన్నం వేశారు. ఈ దొంగలు బ్యాంకులో ఏకంగా రూ. 2 కోట్ల వరకు దోచుకున్నట్లు సమాచారం. తుపాకీలతో బెరించి.. అడ్డుకున్న వాళ్లపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతో ఉడాయించారు.

డియోఘర్ జిల్లా నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధుపూర్‌లోని HDFC బ్యాంకులో సోమవారం మధ్యాహ్నం 1:45 గంటల ప్రాంతంలో ఏడుగురు దొంగలు ప్రవేశించారు. వాళ్లు రావడం రావడంతోనే గార్డులు, ఉద్యోగులు, కస్టమర్లను తుపాకీలతో బెదిరించి బందీలుగా చేసుకున్నారు. ఈ దొంగలపై ప్రతిఘటించిన కొంతమందిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. తర్వాత దొంగలు బ్యాంకు నుంచి సుమారు రూ. 2 కోట్ల (నగదు, నగలు) వరకు దోచుకున్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. దొంగలు పారిపోయిన తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకుకు వెళ్లి బందీలుగా ఉన్న అధికారులు, ఖాతాదారులను విడిపించి, దొంగతనంపై దర్యాప్తు ప్రారంభించారు.

దొంగతనం కేసు సమాచారం అందుకున్న దేవఘర్ పోలీసు సూపరింటెండెంట్ సౌరభ్ వెంటనే బ్యాంకు వద్దకు చేరుకుని బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమీపంలోని అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు, దొంగలు తప్పించుకోకుండా రహదారులపై చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే దేవఘర్, జమ్తారా, గిరిదిహ్, ధన్‌బాద్, బొకారో పరిసర ప్రాంతాలలో రహదారులపై చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. దొంగిలించ డబ్బలు, నగల గురించి బ్యాంకు అధికారులతో కచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు.

Tags

Next Story