Jk Cm Omar Abdullah Delhi Results : ఆప్, కాంగ్రెస్‌లపై విరుచుకుపడిన ఒమర్ అబ్దుల్లా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయం ఆసన్నమైంది. ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రారంభ ట్రెండ్స్‌లో బీజేపీ ముందంజలో ఉంది. ఆప్ కూడా గట్టి పోటీ ఇస్తోంది. చాలా మంది సీనియర్ ఆప్ నాయకులు వెనుకబడి ఉన్నారు. ఢిల్లీలో మొత్తం 70 సీట్లు ఉండగా, మెజారిటీకి 36 సీట్లు అవసరం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వరుసగా మూడోసారి గెలుస్తుందా? రాజధానిలో బీజేపీ 27 ఏళ్ల తర్వాత వికసిస్తోందా? అనేది తేలనుంది. అదే సమయంలో గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్‌కి మళ్లీ నిరేశే మిగిలింది.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక స్థానంలో మెజరిటీలో కొనసాగుతోంది.
కాగా.. ఈ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ పరాజయంపై జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన ట్వీట్ చేశారు.. ఇండియా కూటమిపై విమర్శలు చేసిన సీఎం ఒమర్ అబ్దుల్లా.. మనం మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఇలానే వస్తాయని హితవు పలికారు.. ఇంకా కొట్లాడుకోండి ఇంకా దారుణ ఫలితాలు వస్తాయి అని హేళన చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాంట్ ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com