J&K Flash Floods: జలదిగ్బంధంలో జమ్మూ..ఎక్కడ చూసినా వరద నీరే

జమ్మూలో వరద దారుణంగా కొనసాగుతుంది. గ్రామాలకు గ్రామాలు జల దిగ్బంధనలో చిక్కుకున్నాయి. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఊరేదో ఏరేదో కనిపించడం లేదు. ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద చేరింది. మంచి నీళ్లు లేవు.. ఆహారం లేదు.. కరెంట్ కూడా లేదు. పిల్లలు వృద్ధులు నరకం అనుభవించారు. సాయం కోసం డాబాల పైకి ఎక్కి ఎదురు చూస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది రంగుల్లోకి దిగారు.
ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇళ్లల్లో చిక్కుకున్న వారిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఓవైపు కొండచర్యలు మరోవైపు ఫ్లాష్ ఫ్లడ్స్ హిమాచల్ ను గజగజ వణకిస్తున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో బియాస్ నది ఉగ్ర రూపం దాల్చింది. దాని ఉపనదులు ఉప్పొంగి పారుతున్నాయి. అన్ని డేంజర్ లెవెల్ దాటి ప్రవహిస్తున్నాయి రోడ్లు తెగిపోయాయి. బ్రిడ్జ్ లు కొట్టుకుపోయాయి. నది పక్కనే ఉన్న హోటల్లు ఇళ్లు నామరూపాలు లేకుండా పోయాయి.
వరద ఉదురుతుకి మనాలి జిల్లాలోని వసిష్ట చౌక్ దగ్గర నేషనల్ హైవే సైతం కొట్టుకుపోయింది. గ్రీన్ టాక్స్ ఆలు గ్రౌండ్ దగ్గర వరద ముంచెత్తింది. దీంతో షాపుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించారు అధికారులు. బియాస్ నది ఉద్రృతికి ఓ రెస్టారెంట్ కూడా ధ్వంసమైంది. రెస్టారెంట్ భాగం మొత్తం వరదలో కొట్టుకుపోగా జస్ట్ ముందు గోడ మాత్రమే మిగిలింది. వరద ఉద్రృతి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. అయితే అధికారులు ముందే అలర్ట్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com