Hemant Soren: జార్ఖండ్ సీఎంగా నేడు సొరేన్ ప్రమాణం

జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన చేత గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖుల్లో, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్‌సీపీ-ఎస్‌పీ చీఫ్ శరద్ వవార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ఉన్నారు. ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ఈ ఎన్నికల్లో జేఎంఎం కూటమికి రాష్ట్రంలోని 81 నియోజకవర్గాల్లో 56 స్థానాలు, ఎన్డీయే కూటమికి 24 స్థానాలు లభించిన సంగతి తెలిసిందే.
జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాంచీలోని మొరాబాది స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్‌కు చెందిన జార్ఖండ్ ముక్తిమోర్చా ఆధ్వర్యంలోని ఇండియా కూటమి గ్రాండ్ విక్టరీ సాధించింది. 81 మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎం కూటమి 56, ఎన్‌డీఏ 24 సీట్లు దక్కించుకున్నాయి. ఈ ఎన్నికల్లో హేమంత్ సోరెన్‌తో పాటు ఆయన భార్య కల్పన సోరెన్ సైతం గెలిచింది. ఆదివారం నాడు హేమంత్ సోరెన్ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాందీ, ఎన్‌సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత, మేఘాలయ సీఎం కొన్రాడ్ సంగ్మా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖీ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుతో పాటు సీపీఎం జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్దవ్ ఠాక్రే,, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులు హాజరవుతారు.
ఇక, కాబోయే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనతో కలిసి మంగళవారం పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని రామ్‌గఢ్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న తమ పూర్వీకుల గ్రామం నెమ్రాకు వెళ్లారు. హేమంత్ తండ్రి జేఎంఎం వ్యవస్థాపకుడు శిబూ సోరెన్ ఈ గ్రామంలోనే పుట్టారు. శిబూ 15 ఏళ్లప్పుడు తండ్రి సోబరెన్‌ను స్థానిక వడ్దీ వ్యాపారులు చంపేయడంతో.. తాత సోబరెన్ సోరెన్ 67వ వర్ధంతిని పురస్కరించుకుని అక్కడికి వెళ్లిన హేమంత్ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానికులతో కాసేపు మాట్లాడారు. ఇక, గురువారం నుంచి రాష్ట్రంలో మన ప్రభుత్వం పని చేయబోతుందని ప్రకటించారు. ఎన్నికల్లో కష్టపడిన మీరంతా నా ప్రమాణ స్వీకారానికి రావాలని హేమంత్ సోరెన్ వారిని ఆహ్వానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com