Jodhpur Girl: తల్లి పక్కన పడుకున్న 3 ఏళ్ల చిన్నారి ని ఎత్తుకెళ్ళిన యువకుడు
కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలన్న డిమాండ్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని, నిందితులు ఎలాంటి భీతి లేకుండా నిర్భయంగా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని మరో ఘటన రుజువు చేసింది. తల్లి పక్కన నిద్రిస్తున్న 3 ఏళ్ల చిన్నారిని అర్ధరాత్రి ఎత్తుకెళ్లిన ఓ కామాంధుడు.. ఆ పసిపాపపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ తర్వాత ఆ చిన్నారిని రోడ్డుపైనే వదిలేసి పరారయ్యాడు. తెల్లవారుజామున తన కుమార్తె కనిపించకపోవడంతో ఏడుస్తూ వెతుకుతున్న ఆ తల్లికి.. గాయాలతో పడి ఉన్న చిన్నారి కనిపించింది. ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయగా.. ఆ చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని డాక్టర్లు గుర్తించారు.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ యువకుడు మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు చిన్నారిని ఎత్తుకెళ్తున్న వీడియోను గుర్తించిన పోలీసులు దాని ఆధారంగా అతడి కోసం గాలిస్తున్నారు. ఆలయం బయట తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న బాలికను నిందితుడు ఎత్తుకెళ్లాడు. ఉదయం 6.30 గంటల సమయంలో పొదల్లో ఉన్న బాలికను అటుగా వెళ్లిన ఓ మహిళ గుర్తించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. చిన్నారి పెదవులపై గాట్లు ఉండడం, శరీరంపై గాయాలు ఉండడంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించారు. చిన్నారి అత్యాచారానికి గురైనట్టు పరీక్షల్లో తేలింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో నిందితుడు బాలికను ఎత్తుకెళ్తుండడం సీసీటీవీలో రికార్డయిందని పోలీసులు తెలిపారు. దాని ఆధారంగా నిందితుడి కోసం గాలించి అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలిక తల్లిదండ్రులు మధ్యప్రదేశ్‌కు చెందినవారని, వలస వచ్చి జోధ్‌పూర్‌లోని ఓ మురికివాడలో ఉంటున్నట్టు తెలిపారు. తండ్రి చెత్త ఏరుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడని, బాలిక తల్లి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వివరించారు. వారికి ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నట్టు చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com