నిరసన తెలుపుతున్న వారిపై బాంబులు విసిరారు : బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా

నిరసన తెలుపుతున్న వారిపై బాంబులు విసిరారు : బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా
బెంగాల్‌ బీజేపీ, టీఎంసీ మధ్య వార్ ముదిరింది. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది.. ఈ కార్యక్రమంలో..

బెంగాల్‌ బీజేపీ, టీఎంసీ మధ్య వార్ ముదిరింది. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది.. ఈ కార్యక్రమంలో వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. అయితే వారు సెక్రెటేరియట్ వైపుకు దూసుకెళ్తున్న సమయంలో పోలీసులు వారిని నిలువరించడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో బారికేడ్లను కూడా తోసుకుంటూ బీజేపీ కార్యకర్తలు ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలపై లాఠీలు ఝుళిపించారు. వాటర్ కెనన్లను, టియర్ గ్యాస్‌ను కూడా ప్రయోగించారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై బాంబులు విసిరడంతోపాటు వాటర్ కెనన్స్ ను వాడారని. దీన్ని బట్టే మమతా బెనర్జీ ఎంత అసహనంతో ఉన్నారో అర్థమైపోతోందని విమర్శించారు. మరెంతో కాలం అధికారంలో ఉండబోమన్న తత్వం సీఎం మమతకు బోధపడిందని ఆరోపించారు నడ్డా..

వాటర్ కెనన్ లో ఎలాంటి రసాయనాలు వాడలేదని అది తప్పుడు సమాచారమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణ ఇచ్చారు.. అవసరమైతే చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకోసం.. ఆ వ్యక్తిని గుర్తించడానికి రంగు నీటిని వాడతారని చెప్పారు. ఛలో సెక్రటేరియట్‌లో హింసాత్మక ఘటనలు జరిగినట్లు ఆధారాలున్నాయని... తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పోలీసులపై కూడా దాడి జరిగిందన్నారు... కోల్‌కతా పరిధిలో 89 మందిని, హౌరా ప్రాంతంలో 24 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

Tags

Next Story