Nuh Riots: అల్లర్లలో జడ్జి కారుకి నిప్పు... కారులో 3 ఏళ్ల కూతురు కూడా

Nuh Riots: అల్లర్లలో జడ్జి కారుకి నిప్పు... కారులో 3 ఏళ్ల కూతురు కూడా
కారుని వదలి తమ ప్రాణాల కోసం మహిళా జడ్జి పరుగులు తీయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది

హర్యానా రాష్ట్రంలోని నుహ్ ప్రాంతం మత ఘర్షణలతో అట్టుకుతున్న సంగతి తెలిసిందే. ఊరేగింపుగా వెళ్తున్న ఒక వర్గం వారిపై మరో వర్గం వారు రాళ్ల దాడి చేయడంతో అల్లర్లు చెలరేగాయి.ఈ అల్లర్లలో ఇప్పటిదాకా ఆరుగురు మరణించారు.

అయితే సోమవారం జరిగిన అల్లర్లలో అంజలీ జైన్ అనే మహిళా అదనపు జ్యుడీషియల్ న్యాయమూర్తి(ACJM) తన కారులో ప్రయాణిస్తుండగా, అల్లరిమూకలు ఆమె కారుపై దాడి చేసి నిప్పు పెట్టారు. కారులోని తన 3 సంవత్సరాల కుమార్తెతో సహా ఆమె బయటపడి తృటిలో తమ ప్రాణాలు రక్షించుకున్నారు. కారుని వదలి తమ ప్రాణాల కోసం పరుగులు తీయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఘటనపై ACJM కోర్ట్‌లో పనిచేస్తున్న టెక్ చాంద్‌ ఫిర్యాదుతో మంగళవారం FIR నమోదు చేశారు. నిందితులపై 148, 149, 435, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

కారు నుంచి బయటపడ్డ జడ్జి, తన కూతురుతో కలిసి ఒక పాత బస్టాండ్ షెడ్‌లో దాక్కున్నారు. తర్వాత కొంతమంది న్యాయవాదులు వచ్చి వారిని రక్షించారు.

తన 3 సంవత్సరాల కూతురితో కలిసి మధ్యాహ్నం 1 సమయంలో మందుల కోసం నల్హార్‌లోని మెడికల్ కాలేజికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 2 గంటల సమయంలో సుమారు 100 నుంచి 200 మంది అల్లరి మూకలు కారుపై రాళ్లు రువ్వుతూ దాడి చేశారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

"ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ వచ్చారు. అలాగే కారుకి నిప్పు పెట్టడానికి యత్నించారు. దీంతో మా ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశాము. దగ్గర్లోని పాడుబడ్డ బస్టాండ్ వర్క్‌షాప్‌లో దాక్కోవడంతో, కొందరు న్యాయవాదుల వచ్చి మమ్మల్ని రక్షించారు. మరుసటి రోజు వెళ్లి చూస్తే మా కారుని తగటబెట్టారు" అని ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story