Delhi Cm Kejriwals: కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై సస్పెన్స్..

Delhi Cm Kejriwals: కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై  సస్పెన్స్..
ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వాయిదా

మద్యం పాలసీ కేసులో బెయిల్‌ కోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మరికొంత కాలం నిరీక్షించక తప్పేట్టు లేదు. సీబీఐ అరెస్టును సవాల్‌ చేస్తూ, బెయిల్‌ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. గురువారం ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈడీ కేసులో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేయటాన్ని తప్పుబట్టింది. కోర్టు అనుమతి తీసుకోవాలి కదా.. అంటూ సీబీఐని మందలించింది. కేజ్రీవాల్‌ పిటిషన్లపై సెప్టెంబర్‌ 10న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది! సీబీఐ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. అరెస్టును ఢిల్లీ హైకోర్టు సమర్థించగా, ఆయన సుప్రీంను ఆశ్రయించారు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ దాఖలు చేసిన కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌కు బెయిల్ రాగా.. సీబీఐ దాఖలు చేసిన కేసులో మాత్రం బెయిల్ రాకపోవడంతో ఆయన ఇంకా తీహార్ జైలులోనే ఉన్నారు. కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఒకసారి సార్వత్రిక ఎన్నికల సమయంలో మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చి తిరిగి తీహార్ జైలుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయవాదులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జర్ భూయాన్.. తీర్పును మంగళవారానికి రిజర్వ్ చేశారు.

బెయిల్ పిటిషన్ల సందర్భంగా సీబీఐ తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు.. అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తే అది ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిరుత్సాహపరిచినట్లే అవుతుందని పేర్కొన్నారు. ఇక కేజ్రీవాల్ తరఫు వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వీ.. ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నందున ఎక్కువ ఆయనకు బెయిల్ ఇస్తే దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని కోర్టుకు విన్నవించారు. గత 2 ఏళ్లుగా ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయని సీబీఐ.. జూన్ 26వ తేదీన కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిందని సింఘ్వీ కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది.

Tags

Next Story