Justice UU Lalit: భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్..

Justice UU Lalit: భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్..
Justice UU Lalit: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ బాధ్యతలు చేపట్టారు.

Justice UU Lalit: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ బాధ్యతలు చేపట్టారు. భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ లలిత్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు హాజరయ్యారు.

జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ 1957 నవంబరు 9న జన్మించారు. 1983 జూన్‌లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 1985 డిసెంబర్ వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. ఆ మరుసటి ఏడాది.. ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీసు షురూ చేశారు. 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అనేక కీలక కేసుల తీర్పుల్లో జస్టిస్ లలిత్ కూడా భాగస్వామిగా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story