వచ్చే ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి పోటీ చేయనున్న కమల్ హాసన్ !

వచ్చే ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి పోటీ చేయనున్న కమల్ హాసన్ !
2024 సార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి కమల్ హాసన్ పోటీ చేసే ఛాన్స్

తమిళ సూపర్ స్టార్, MNM వ్యవస్థాపక అధ్యక్షుడు, కమల్ హాసన్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన వానతీ శ్రీనివాసన్‌పై 1,728 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన కమల్ హాసన్‌కు.. కోయంబత్తూరు సీటును కేటాయించేందుకు DMK ఆసక్తి కనబరుస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కోయంబత్తూరు సౌత్ అసెంబ్లీ నియోజకవర్గంలో MNM రాష్ట్ర స్థాయి ప్రచారాన్ని ‘మక్కలోడు మయ్యమ్’ కమల్ హాసన్ జూలై 24న ప్రారంభించారు.

తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వార్డు, పంచాయతీ స్థాయిలో ప్రజలను కలవాలని ఎంఎన్ఎం యోచిస్తోంది. ఇందులో ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు పట్టించుకోని సమస్యలు కూడా ఉన్నాయి. అట్టడుగు స్థాయి ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూరు స్థానం నుంచి పోటీ చేయాలని తమిళ సూపర్‌స్టార్‌కు పార్టీ కోయంబత్తూరు జిల్లా కార్యకర్తలు ఇప్పటికే విజ్ఞప్తి చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కమల్ హాసన్ ఇటీవల ఓ మహిళా బస్సు డ్రైవర్ కు కారు గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే ఆమె ఇటీవలె తన ఉద్యోగాన్ని కోల్పోయారు. దీంతో ఆమెకు కారు బహుమతిగా ఇచ్చిన కమల్ హాసన్.. జీవితంలో ఎంతో మందికి ఉపాధి కల్పించేలా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆమెను తన ఆఫీసుకు పిలిపించుకుని కారు బహుమతిగా అందించారు. డీఎంకే ఎంపీ కనిమొళి ఇటీవల కోవైలో పర్యటించిన సందర్భంగా ఓ మహిళ డ్రైవర్ బస్సులో ప్రయాణించారు. ఆ సమయంలో బస్సు కండక్టర్.. ఎంపీకి టికెట్ ఇవ్వడాన్ని ఆ మహిళా బస్సు డ్రైవర్ తప్పుపట్టారు. దీంతో ఆ ట్రావెల్స్ యాజమాన్యం ఆమెను విధుల నుంచి తొలగించింది. ఈ వివాదంపై స్పందించిన కమల్ హాసన్ ఆమెకు తన వంతు సాయం చేస్తున్నట్లు ప్రకటించారు.

కోయంబత్తూరులో నివాసముంటున్న షర్మిలకు కమల్ కారును బహుమతిగా ఇవ్వడమనేది.. ఆ ప్రాంతంలో పాపులారిటీ సంపాదించడానికి చేసిన ఎత్తుగడగా కొందరు ఆరోపిస్తున్నారు.

షర్మిల ఎవరంటే..

కోయంబత్తూరుకు చెందిన షర్మిల చాలా మందికి తెలిసే ఉంటుంది. చిన్న వయస్సులోనే తొలి మహిళా బస్సు డ్రైవర్ గా మారిన ఆమె.. వాడవల్లి ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ మహేష్ కుమార్తె. ఆమె వయస్సు 24. తనకు డ్రైవింగ్ నేర్పించాలని పట్టుబట్టడంతో ఆమె తండ్రి షర్మిలకు డ్రైవింగ్ లో శిక్షణ ఇప్పించారు. గతేడాది 2019 నుంచి కోయంబత్తూరులో షర్మిల ఆటో నడుపుతూ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత భారీ వాహనాల వైపు వెళ్లారు. ఆ తర్వాత ఆమె బస్సు నడుపుతుండగా తీసిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ మహిళా బస్సు నడుపుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు వచ్చి ఆమెను సత్కరించడం ప్రారంభించారు. అలా ఇటీవల కనిమొళి కూడా షర్మిలను సత్కరించగా.. అది కాస్త వివాదానికి దారి తీసింది. అయితే షర్మిలను ఉద్యోగంలో నుంచి తొలగించారని వార్తలు రాగా.. షర్మిలనే తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story