Kamal Haasan: కోయంబత్తూరు నుంచి కమల్ హాసన్ పోటీ..!!
Kamal Haasan: ప్రముఖ నటుడు, MNM పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూర్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. తమిళనాడులోని DMK పార్టీతో కమల్ పార్టీలో పెత్తు పెట్టుకుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థానం నుంచి పోటీ చేసిన కమల్ కేవలం 1,728 స్వల్ప ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. సెంటిమింట్ కలిసి వచ్చే అవకాశం ఉండటంతో ఆ స్థానం నుంచి పోటీ చేయించడానికి DMK ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన ఏ పార్టీ చేయలేదు. కోయంబత్తూరు జిల్లాకి చెందిన పార్టీ నేతలు కూడా కమల్ హాసన్‌ని ఈ విషయంపై అడిగారు.
క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవ్వడానికి ఆదివారం కమల్ హాసన్ మక్కలోడు మైమ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఈ కార్యక్రమం ద్వారా క్షేత్ర స్థాయిలోని పార్టీ కార్యకర్తలు, నేతలు వీధి, వీధినా తిరుగుతూ స్థానిక సమస్యలను తెలుసుకోనున్నారు. అలాగే ఇతర పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల దృష్టికి రాని సమస్యలపై దృష్టి పెడుతూ ప్రజల నుంచి స్పందన కోరనున్నారు. క్షేత్రస్థాయిలో తిరిగే కార్యకర్తలకు 25 ప్రశ్నలతో కూడిన గూగుల్ ఫాం(Google Form)లు అందించి, వాటి ద్వారా ఎప్పటికప్పుడు వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి, నియోజకవర్గాల వారీగా ఆ అంశాలపై గళమెత్తనున్నారు.
ప్రజల నుంచి వచ్చే స్పందనను అనుసరించే వచ్చే ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోను తయారు చేయనున్నట్లు సీనియర్ నేతలు వెల్లడిస్తున్నారు.
ఇటీవల DMK నేత విషయంలో బస్సులో కండక్టర్‌పై వాగ్వివాదానికి దిగడంతో షర్మిల అనే బస్ డ్రైవర్‌ను బస్ యజమాని ఆమెని విధుల్లోంచి తొలగించాడు. కమల్‌హాసన్ ఆమెని కలిసి ఒక కారు కూడా బహుమతిగా అందించాడు. ఈ మహిళా డ్రైవర్ కూడా కోయంబత్తూరుకు చెందినదే కావడం గమనార్హం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com