Kangana Ranaut: కంగనా రనౌత్ పై చేయిచేసుకున్న మహిళా కానిస్టేబుల్

బాలీవుడ్ నటి, భాజపా MP కంగనా రనౌత్ కు చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్ విమానాశ్రయంలో CISF మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెనుచెంపదెబ్బ కొట్టారు. దిల్లీకి వెళ్లేందకు చండీగఢ్ విమానాశ్రయంలో బోర్డింగ్ పాయింట్ కు వెళ్తుండగా ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాల్ని నిరసిస్తూ దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతుల్ని అగౌరవపరిచేలా కంగన చేసిన వ్యాఖ్యలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.
కంగన ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మండి సీటు నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దిల్లీ చేరుకున్న అనంతరం కంగన CISF డైరెక్టర్ జనరల్ , ఇతర సీనియర్ అధికారుల్ని కలిసి ఈ ఘటన గురించి వివరించారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు.. కుల్విందర్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించేందుకు CISF కమాండెంట్ కార్యాలయానికి తరలించారు. ఘటనపై కంగనా రనౌత్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దిల్లీ వెళ్లిన అనంతరం చండీగఢ్ సంఘటనపై ‘ఎక్స్’ వేదికగా కంగనా రనౌత్ స్పందించారు. పంజాబ్‌లో ఉగ్రవాదం పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘విమానాశ్రయంలో భద్రతా తనిఖీ పూర్తిచేసుకొని వెళుతున్నాను. సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ నా పక్కనుంచి వచ్చి ముఖం మీద కొట్టి తిట్టడం ప్రారంభించింది. ఎందుకలా చేశావ్ అని ఆమెను అడిగాను. రైతుల ఆందోళనలకు మద్దతిస్తున్నానని ఆమె తెలిపింది. నేను క్షేమమే కానీ.. పంజాబ్‌లో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని ఎలా ఎదుర్కోవాలన్నదే నా ఆందోళన’’ అని ఆమె పేర్కొన్నారు.
రైతులను అవమానించేలా మాట్లాడినందుకే.. బాలీవుడ్ నటి..., భాజపా MP కంగనా రనౌత్ ను చెంప దెబ్బ కొట్టినట్లు........ CISFమహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ స్పష్టం చేశారు. 2020లో.... వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన రైతుల నిరసనలో తన తల్లి కూడా పాల్గొన్నదని గుర్తు చేశారు. నాటి రైతుల ఉద్యమంపై........ అసభ్యకరంగా కంగనా సామాజిక మాధ్యమంలో ట్విట్టర్ లో పోస్టులు చేశారని కుల్విందర్ మండిపడ్డారు. రైతులు నిరసనలో 100 రూపాయల కోసం కూర్చున్నారని ఆమె పోస్టులుచేశారని దుయ్యబట్టారుఆ సమయంలో తనతల్లి కూడా నిరసనలో పాల్గొన్నారని కుల్విందర్ తెలిపారు. రైతులను అవమానించేలా ట్విటర్ లో పోస్టులు పెట్టినందుకే.. కంగనా చెంపపై కొట్టినట్లు వివరించారు. అటు ఈ ఘటనపై కుల్విందర్ ను CISF సస్పెండ్ చేసింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com