Ranya Rao: 17 బంగారు బిస్కెట్లు తీసుకొచ్చా..

కన్నడి నటి రాన్యా రావు ను ఇటీవల బెంగుళూరు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 17 బంగారు బిస్కెట్లతో ఆమె బెంగుళూరు విమానాశ్రయంలో పట్టుబడ్డారు. అరెస్టు చేసిన ఆమెను పోలీసులు విచారించారు. తన వాంగ్మూలంలో కొన్ని విషయాలను ఆ నటి వెల్లడించింది. విదేశాల నుంచి 17 బంగారు బిస్కెట్లు తీసుకువచ్చినట్లు ఆమె అంగీకరించింది. రెవన్యూ అధికారులకు ఆ వాంగ్మూలంలో ఈ విషయాన్ని ఆమె స్పష్టం చేసినట్లు ఎఫ్ఐఆర్ ద్వారా తెలిసింది. గత ఏడాది కాలంలో తాను వెళ్లిన విదేశీ టూర్ల గురించి కూడా ఆమె చెప్పింది. మిడిల్ ఈస్ట్, దుబాయ్‌తో పాటు కొన్ని పాశ్చాత్య దేశాలకు వెళ్లినట్లు ఆమె పేర్కొన్నది.
యూరోప్ వెళ్లాను, అమెరికా, మిడిల్ ఈస్ట్ వెళ్లానని తన వాంగ్మూలంలో రాన్యా రావు తెలిపింది. దుబాయ్, సౌదీ అరేబియా కూడా వెళ్లినట్లు పేర్కొన్నది. ప్రస్తుతం చాలా అలసిపోయానని, ఇంతకన్న ఎక్కువ విషయాలు ఏమీ చెప్పలేనని ఆమె పేర్కొన్నది. గత ఏడాది కాలంలో ఆమె దుబాయ్‌కు 27 సార్లు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. తన వాంగ్మూలంలో కుటుంబ సభ్యుల వివరాలను ఆ నటి చెప్పింది. తన తండ్రి పేరు కేఎస్ హెగ్డేశ్ అని, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి అని, తన భర్త పేరు జతిన్ హుక్కేరి అని, ఆయన ఓ ఆర్కిటెక్ట్ అని ఆమె పేర్కొన్నది. తన తల్లికి చెందిన రెండో భర్త కర్నాటక పోలీసు హౌజింగ్ శాఖ డీజీపీ రాంచంద్రరావు అని ఆమె తన వాంగ్మూలంలో చెప్పింది.
ప్రస్తుతం రాన్యా రావు జుడిషియల్ కస్టడీలో ఉన్నది. న్యాయంపై నమ్మకం ఉన్నట్లు తెలిపింది. ఎవరి వత్తిడిలేకుండా, స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇచ్చినట్లు పేర్కొన్నది. సోమవారం రాత్రి కెంపగౌడ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారు రాన్యా రావును పట్టుకున్నారు. సుమారు 15 కోట్ల విలువైన 14 కిలోల బంగారు కడ్డీలు ఆమె తీసుకెళ్తూ దొరికింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com