Shiva Rajkumar: విజయ్ ఏదైనా అడుగు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి..

తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని కన్నడ నటుడు శివరాజ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా యాక్టర్ శివరాజ్ విలేకరులతో మాట్లాడుతూ.. తన స్నేహితుడు అయిన విజయ్ రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నాను అన్నారు. కానీ, కరూర్ తొక్కిసలాట వివాదం లాంటివి మరోసారి జరగకుండా వేసే ప్రతి అడుగును జాగ్రత్తగా ఆలోచించి వేయాలని సూచించారు. అయితే, కరూర్ తొక్కిసలాట ఎలా జరిగిందో తనకు తెలియదు.. కాబట్టి, విజయ్ మరింత జాగ్రత్తగా తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఇక, కరూర్ తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదం రాజకీయ ఉద్రిక్తతకు దారి తీసింది. ర్యాలీలో ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు విజయ్ పార్టీ తమిళగ వెట్రీ కజగం (టీవీకే) ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. టీవీకే ఈ ఆరోపణలను ఖండించి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణకు ఆదేశించాలని కోరింది. ర్యాలీకి 10,000 మంది హాజరుకు అనుమతి తీసుకున్నప్పటికీ, దాదాపు 30,000 మంది ప్రజలు వేదిక దగ్గరకు వచ్చారని పోలీసులు వెల్లడించారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు చొప్పున పరిహారం అందించనున్నట్లు విజయ్ ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com