Uttarpradesh: ప్రేమించిన అమ్మాయి హత్య, డెడ్ బాడీలో యమునా నదిలో

Uttarpradesh: ప్రేమించిన అమ్మాయి హత్య,  డెడ్ బాడీలో యమునా నదిలో
X
వేరే అమ్మాయితో కలిసి ఉండడాన్ని భరించలేక ప్రియుడిని నిలదీయడంతోనే

యూపీ కాన్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. వేరే అమ్మాయితో కలిసి ఉండడాన్ని భరించలేని యువతి.. ప్రియుడిని నిలదీసింది. దీంతో అతి దారుణంగా యువతిని హత్యచేశాడు ప్రియుడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మరో అమ్మాయితో రొమాంటిక్ రిలేషన్‌లో ఉన్న ప్రియుడిని నిలదీసినందుకు అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు. సూరజ్ అనే యువకుడు ఆకాంక్ష యువతిని ప్రేమించాడు. కొన్ని రోజుల నుంచి ఫిజికల్ రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారు. అయితే ప్రేమించిన యువతితోనే కాకుండా.. మరో యువతితో కూడా సూరజ్ ఫిజికల్ రిలేషన షిప్ మెయింటేన్ చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆకాంక్ష ప్రియుడి నిలదీసింది. దీంతో యువతిపై కోపంతో ఆమె గొంతు కోసం హత్య చేశాడు. అనంతరం ప్రియురాలి డెడ్ బాడీని..తన ఫ్రెండ్ సాయంతో సూట్ కేస్ లో పెట్టి యమునా నదిలో పడేశాడు.

యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్య చేసి నదిలో పడేసినట్టు తెలిపారు. యమునా నదిలో ఆకాంక్ష బాడీ కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు పోలీసులు.

Tags

Next Story