Karnataka : కాంగ్రెస్ ఘన విజయానికి కారణమైన ఆరు విషయాలు

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయపథంలో దూసుకుపోతుంది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఆధిక్యంలో మెజార్టీ మార్క్‌ను క్రాస్ చేసింది. దీంతో హస్తం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి కారణమైన ఆరు విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
కాంగ్రెస్ మేపిఫెస్టోలో ముఖ్యమైన హామీల్లో గృహజ్యోతి పథకం ముఖ్యమైంది. దీంతో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించింది, అలాగే మహిళలను బాగా ఆకర్షించిన మరో పథకం గృహలక్ష్మి.ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు ప్రతి నెల 2 వేల రూపాయలు అందజేయనున్నారు. అలాగే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి అన్న భాగ్య పథకం ద్వారా10 కేజీల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మరోవైపు నిరుద్యోగ పట్టభద్రులకు ప్రతి నెల 3వేల నిరుద్యోగ భృతి పథకం కూడా కాంగ్రెస్‌కు బాగా కలసివచ్చినట్లు కనిపిస్తోంది. అటు డిప్లోమా పూర్తి చేసి నిరుద్యోలుగా ఉన్న యువతకు యువ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందించే పథకం కూడా బాగానే పనికి వచ్చినట్లు కనిపిస్తోంది.ఇక మహిళలకు ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం కూడా కాంగ్రెస్ విజయానికి కారణమైందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com