Karnataka : జేడీఎస్ పరిస్థితి దారుణం

కర్ణాటక ఎన్నికల్లో... జేడీఎస్ పరిస్థితి దారుణంగా తయారైంది. 2018 ఎన్నికల్లో 32 స్థానాలు సాధించిన.. ఆ పార్టీ.... ఈ సారి ఎన్నికల్లో .. కేవలం 21 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. దాదాపు పది సీట్లు కోల్పోయింది. హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్....అవుదామకున్న కుమారస్వామి... ఇప్పుడు ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఓ వైపు సర్వేలు.. కాంగ్రెస్కే జనం పట్టం కడుతారని చెప్పినా... కుమార్ స్వామి మాత్రం హంగ్ పై ఆశలు పెట్టుకున్నారు. తనకొచ్చే సీట్లతో... కింగ్ మేకర్గా మారవచ్చని భావించారు. అయితే.. ఆయన ఆశలు అడి ఆశలయ్యాయి.
గత రాత్రి హుటహుటిన సింగపూర్ నుంచి బెంగళురూ చేరుకున్న ఆయన... ప్రత్యేకంగా పూజులు చేశారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రెండు పెద్ద పార్టీలే భారీ స్కోర్ చేస్తాయని అన్నారు. చిన్న పార్టీ అని.. తనకు అంత డిమాండ్ లేదన్నారు కుమారస్వామి. అంతేకాదు హంగ్ వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇక...తనను ఎవరూ సంప్రదించలేదన్నారు కుమారస్వామి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com