Karnataka: కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు.. రంగంలోకి 15 హెలికాప్టర్లు

కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు మొదలైయ్యాయి.ముందస్తుగా కర్ణాటక సరిహద్దు రాష్ట్రాల్లో ఇప్పటికే క్యాంప్ పాలిటిక్స్‌కు శ్రీకారం చుట్టాయి. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డాయి.ఎమ్మెల్యే లను తరలించేందుకు 15 హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్లు సమాచారం. అధికారంలో ఉన్న పార్టీని ఓడించాలన్న సంప్రదాయాన్ని కన్నడిగులు కొనసాగిస్తున్నారు.ముందస్తుగా హోటల్స్‌ను బుక్ చేశాయి. గెలిచిన ఎమ్మెల్యేలందరిని క్యాంప్ తరలించే ఏర్పాట్లు మొదలు పెట్టాయి..బెంగళూరులోనే మకాం వేశారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహాల ఇన్‌ఛార్జ్ సుర్జేవాలా. AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే, డీకే, సిద్ధరామయ్య, మేనిఫెస్టోకమిటీ ఛైర్మన్ పరమేశ్వర్‌తో ఆయన మంతనాలు జరుపుతున్నారు.అటు పోటీ చేసిన అందరు అభ్యర్థులతో మాట్లాడుతున్నారు సిద్ధరామయ్య,డీకే శివకుమార్.గెలిచిన ఎమ్మెల్యేలను బెంగళూరు తీసుకురావాల్సిందిగా..ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు ఆదేశాలు జారీ అయ్యాయి. కాంగ్రెస్ నేతలతో రెబల్ అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు టచ్‌లోకి వెళ్లారు. రేపు సీఎల్పీ సమావేశం ఉండే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com