Karnataka: తులసి వనంలో గంజాయి మొక్క

Karnataka: తులసి వనంలో గంజాయి మొక్క
గంజాయి సాగు చేస్తున్న మెడికో అరెస్ట్

డాక్టర్ అయ్యి హాస్పిటల్ కి వెళ్లాల్సిన యువకుడు రూటు మారిపోయి పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. తన తెలివిని ఉపయోగించి మెడిసిన్ చదివి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వాడు, అదే తెలివిని ఉపయోగించి డబ్బు కోసం పక్కదారి పట్టాడు. హైటెక్ పద్ధతులను ఉపయోగించి ఇండోర్ ప్లాంట్స్ ని పెంచినట్లు గంజాయి మొక్కలను పెంచాడు. మరో ఇద్దరిని సహాయానికి కలుపుకుని కాలేజీ విద్యార్థులకు గంజాయి అమ్మడం మొదలుపెట్టాడు. చివరకు దొరికిపోయి ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన విఘ్నరాజ్.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతున్నాడు. ఎలా అయినా డబ్బు సంపాదించాలనే కోరికతో తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. అధునాతన పద్ధతులలో ఇంట్లోనే గంజాయి సాగుకు పూనుకున్నాడు. దీనికోసం ఇంట్లో ప్రత్యేకంగా ఓ సెటప్ ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టూ పరద చుట్టి, లోపల వేడి కోసం లైట్లు, గాలి కోసం ఫ్యాన్ ఏర్పాటు చేశాడు. గంజాయికి ఉండాల్సిన ఒక నిర్థిష్టమైన టెంపరేచర్ మెయింటైన్ చేశాడు. అలాగే మొక్కలు పెరిగినతరువాత కటింగ్ కోసం అనువుగా ఒక ప్లాన్ సిద్ధం చేయికున్నాడు. చెట్టు పెరిగిన తర్వాత తగినంత తేమ కలిగి ఉన్నప్పుడు మాత్రమే మంచి గంజాయి ఉత్పత్తి అవుతుంది. దానికోసం కూడా ఏర్పాట్లు చేసాడు. పారిశ్రామిక అవసరముల కొరకు గంజాయి నారను, విత్తనాల నుండి నూనెను, మందుల కోసం ఆకులను వినియోగిస్తారు.. కానీ వీటన్నింటికంటే గంజాయి మత్తు మందుగా మాత్రమే ఎక్కువ వినియోగిస్తున్నారు. అయితే ఈ మొక్కలు పెరిగే కొద్దీ వాసన చాలా దూరం వరకు విస్తరిస్తుంది. దానిని మరి ఎలా మేనేజ్ చేసేడో తెలియదు గానీ మొత్తానికి గంజాయిని పద్దతి గా పెంచి పండిదొరై, వినోద్ కుమార్ ల సాయంతో కాలేజీ విద్యార్థులకు అమ్మడం మొదలుపెట్టాడు.

విశ్వసనీయ సమాచారం అందడంతో పక్కా ప్లాన్ తో పోలీసులు విఘ్నరాజ్ ఇంట్లో సోదాలు జరిపారు. 227 గ్రాముల గంజాయి, 1.53 గ్రాముల పచ్చి గంజాయి, 10 గ్రాముల చరస్‌లు, గంజాయి విత్తనాలతో కూడిన చిన్న సీసాలతో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిండితులపై శివమొగ్గపోలీస్ స్టేషన్ లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సస్ చట్టం, ఐపీసీ సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.

Tags

Read MoreRead Less
Next Story