Karnataka: కులాంతర వివాహం చేసుకుందని గర్భిణితో ఉన్న కూతురిని చంపేసిన తండ్రి..

Karnataka: కులాంతర వివాహం చేసుకుందని గర్భిణితో ఉన్న కూతురిని చంపేసిన తండ్రి..
X
కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఒక గర్భిణీ స్త్రీ కులాంతర వివాహం చేసుకున్నందుకు ఆమె తండ్రి, బంధువులు దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. హత్యతో సంబంధం ఉందని భావించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఒక గర్భిణీ స్త్రీని ఆమె సొంత తండ్రి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఆ మహిళ కులాంతర ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆమె కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది.

ఆదివారం సాయంత్రం ఇనామ్ వీరపుర గ్రామంలో ఈ సంఘటన జరిగింది, నిందితుడు తన కుమార్తె మాన్య పాటిల్ పై ఇనుప రాడ్ తో దాడి చేశాడని ఆరోపించారు. ఆమె అత్తమామలు అడ్డుకునే ప్రయత్నం చేసిన క్రమంలో వారిపై కూడా దాడి జరిగింది. మాన్యను ఆసుపత్రికి తరలించారు కానీ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది.

మాన్య కుటుంబం నుండి బెదిరింపులు రావడంతో ఆ జంట గతంలో అధికారులను ఆశ్రయించారని పోలీసులు తెలిపారు. రాజీకి వచ్చిన తరువాత కొన్ని రోజుల క్రితమే గ్రామానికి తిరిగి వచ్చారు.

మాన్య యొక్క అత్తగారు చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి మెరుగైన తరువాత మరిన్ని వివరాలు సేకరించగలం అని ధార్వాడ్ పోలీసు సూపరింటెండెంట్ గుంజన్ ఆర్య అన్నారు.

బాధితురాలి తండ్రితో సహా ముగ్గురు నిందితులను హుబ్బళ్లి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేరంలో దగ్గరి బంధువుల ప్రమేయం ఉన్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తెలిసింది. పరువు హత్యగా పరిగణించి, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

Tags

Next Story