CM Siddaramaiah: కర్ణాటకలో ఉండేవాళ్ళంతా కన్నడ నేర్చుకోవాలి - సీఎం సిద్ధరామయ్య

CM Siddaramaiah: కర్ణాటకలో  ఉండేవాళ్ళంతా కన్నడ నేర్చుకోవాలి - సీఎం సిద్ధరామయ్య
X
కన్నడ సంస్కృతి ప్రతిబింబించేలా కృషి

కర్ణాటకలో నివసించే ప్రతి ఒక్కరూ కన్నడ తప్పక నేర్చుకోవాలని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య స్పష్టంచేశారు. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కన్నడలో మాత్రమే మాట్లాడతామని ప్రతిజ్ఞ చేయాలని కోరారు. బెంగళూరులోని కర్ణాటక శాసనసభ పశ్చిమ ప్రవేశ ద్వారం వద్ద నాడ దేవి భువనేశ్వరి కాంస్య విగ్రహ ఏర్పాటు భూమి పూజ సందర్భంగా ఆయన ఈ విధంగా మాట్లాడారు. ‘కన్నడ తప్ప ఇంకో భాష మాట్లాడనని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి. కన్నడిగులు ఉదారవాదులు. అందుకే ఇక్కడ కన్నడ నేర్చుకోకుండానే ఇతర భాషలు మాట్లాడేవారు నివసించగలుగుతున్నారు. మనం మాతృభాషలో మాట్లాడాలి’ అని అన్నారు.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితి లేదని కర్ణాటక సీఎం పేర్కొన్నారు. వాళ్ల మాతృభాషలోనే మాట్లాడుతారని.. ఇక్కడ కూడా స్థానిక భాషలోనే మాట్లాడాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. విధాన సౌధలో ఏర్పాటు చేయనున్న నాదాదేవీ భువనేశ్వరి మాత కంచు విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags

Next Story