CM Siddaramaiah : ఇకపై ఎన్నికల్లోనూ పోటీచేయను -కర్ణాటక సీఎం

CM Siddaramaiah : ఇకపై   ఎన్నికల్లోనూ పోటీచేయను -కర్ణాటక సీఎం
సిద్ధరామయ్య సంచలన నిర్ణయం

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం తన సొంత నియోజకవర్గంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని సిద్దరామయ్య ఆయన సొంత నియోజక వర్గం అయిన వరుణ నియోజక వర్గంలో ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల నుండి రిటైర్మెంట్ ప్రకటించడం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది.

కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నిర్ణయం ఆయన అభిమానులను కలిచివేసింది. మైసూరు జిల్లాలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య విలేకరులతో మాట్లాడుతూ తనకు వయసు మీద పడుతోందని, మరో నాలుగేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయను అని సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు.తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయాల నుంచి తాను పూర్తిగా తప్పుకుంటానని, తాను ఎమ్మెల్యేగా పోటీ చెయ్యనని సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. రాజకీయల నుంచి తప్పుకుంటాను అనే నిర్ణయం వెనుక గల కారణాలను సిద్ధరామయ్య స్వయంగా వివరించారు. తన శారీరక స్థితి, ఆరోగ్యం గురించి తనకే ఎక్కువగా తెలుసు అని, మునుపటిలా తాను ఉత్సాహంగా పనిచేయలేకపోతున్నానని, అందుకే తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని సీఎం సిద్దరామయ్య అన్నారు.

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని నాకేమీ చింత లేదని, రాజకీయ ఒత్తిడి కారణంగా తనకు ఆందోళన ఉంటే టెన్షన్ ఉంటుందని, అందుకే ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. అయితే సీఎం సిద్దరామయ్య ఆయన ఐదేళ్లు సీఎం పదవిలో ఉండాలనే కోరికతో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యనని ప్రకటించారని తెలిసింది.

రెండున్నర ఏళ్ల తరువాత సీఎం పదవి నుంచి దిగిపోకుండా ఉండటానికి సిద్దరామయ్య ఇలా మాట్లాడి ఉంటారని కాంగ్రెస్ కు చెందిన కొందరు నాయకులు అంటున్నారు. ఈ విషయంలో సిద్దరామయ్య వ్యతిరేక వర్గం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలని కాంగ్రెస్ లోకి మరికొంత మంది నాయకులు అంటున్నారు. సిద్దరామయ్య ప్రకటనతో ఆయన అభిమానులు మాత్రం ఉలిక్కిపడుతున్నారు. మొత్తం మీద లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు కొన్ని రోజుల ముందే కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆయన అభిమానులకు షాక్ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story