Karnataka: భార్యపై అనుమానం, హత్య .. ఏకంగా 230 కిలోమీటర్లు ప్రయాణించి

తన భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉన్నట్లు భర్త అయిన పోలీస్ కానిస్టేబుల్ అనుమానించాడు. తన ఫోన్ ఆన్సర్ చేయటంలేదు అన్న ఆవేశంలో 230 కిలోమీటర్లు ప్రయాణించాడు. పది రోజుల కిందట బిడ్డకు జన్మనిచ్చి పుట్టింట్లో ఉన్న ఆమెను హత్య చేశాడు. కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
కర్ణాటకలోని చామరాజనగర్‌లో నివసించే 32 ఏళ్ల కిషోర్ కుమార్‌కు, 24 ఏళ్ల ప్రతిభతో 2022 నవంబర్ 13న పెళ్లి జరిగింది. కిషోర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కర్ణాటకలోని చామరాజనగర్‌లో నివసిస్తున్నాడు. అయితే వివాహం తరువాత నుంచి తన భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కిషోర్ తరుచుగా ప్రతిభ ఫోన్‌కి వచ్చే మెసేజులు, కాల్స్ పరిశీలించేవాడు. ఆమెతో మాట్లాడే ప్రతీ వ్యక్తి గురించి ఆరా తీసేవాడు. ఈ క్రమంలో పుట్టింట్లో ఉన్న భార్య ప్రతిభకు ఆదివారం ఫోన్ చేసి తిట్టాడు. ఆమె ఏడ్వటంతో జోక్యం చేసుకున్న తల్లి ఫోన్ కట్ చేసింది. చంటి బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా భర్త ఫోన్‌కు సమాధానం ఇవ్వవద్దని చెప్పింది. . చంటి బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా భర్త ఫోన్‌కు సమాధానం ఇవ్వవద్దని చెప్పింది. అనుమానం పెంచుకున్న అతను ఏకంగా ప్రతిభకు 150 సార్లు కాల్ చేసాడు. ఆమె ఫోన్ తియ్యకపోవడంతో సోమవారం ఉదయం 11.30 గంటలకు అత్తవారింటికి చేరుకున్నాడు. ముందే క్రిమిసంహారక మందు తాగిన అతడు తలుపు తట్టాడు. ఆ తర్వాత భార్య గదిలోకి వెళ్లి లాక్ వేశాడు. చున్నీతో ఆమె గొంతు నొక్కి హత్య చేశాడు. అనంతరం భార్యను చంపేశానని అరుస్తూ గది నుంచి బయటకు వచ్చాడు. అక్కడి నుంచి పారిపోయాడు.
తక్షణం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోలుకున్న తర్వాత అరెస్ట్ చేస్తామని పోలీస్ అధికారులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com