DK Shivakumar: ఆదాయానికి మించిన అక్రమార్కుల కేసులో డీకే కి షాక్

DK Shivakumar:  ఆదాయానికి మించిన అక్రమార్కుల కేసులో డీకే కి  షాక్
కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు

కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌కు కర్ణాటక హైకోర్టు షాకిచ్చింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన కేసును కొట్టివేయాలని డీకే శివకుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు గురువారం కొట్టి వేసింది. మూడు మాసాల్లో విచారణను పూర్తి చేయాలని సీబీఐని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆస్తుల కేసులో సీబీఐ విచారణపై 0న్న స్టేను కర్ణాటక హైకోర్టు ఎత్తివేసింది.

ఆదాయానికి మించిన అక్రమార్కుల కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ ను సవాలు చేసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కి ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. కేసును సవాలు చేస్తూ డీకే శివకుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారువిచారణ చేపట్టిన కోర్టు , కేసులో విచారణ చాలా వరకు పూర్తయినందున ఈ దశలో తాము జోక్యం చేసుకోవడం సరైనది కాదని జస్టిస్ కె.నటరాజన్ అభిప్రాయపడ్డారు.

నిజానికి 3 నెలల్లో విచారణ ముగించి తుది నివేదికను సమర్పించాలని సీబీఐను కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో డీకేకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. అక్టోబర్ 2, 2020న సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను డీకే శివకుమార్ సవాలు చేశారు. ఫిబ్రవరి 2023లో విచారణ చేసిన కోర్టు తీర్పుపై స్టే విధించింది. 2013-2018 మధ్య కాలంలో డీకే, అతని కుటుంబ సభ్యులు రూ.74 కోట్ల అక్రమ ఆస్తులు సంపాదించారని సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచి బీజేపీ డీకే శివకుమార్ పై విమర్శలు ప్రారంభించింది. అధికార కాంగ్రెస్ , ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

2020 అక్టోబరు 3వ తేదీన అక్రమాస్తులు సంపాదించిన కేపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై అవినీతి నిరోధక చట్టం 1988లోని పలు సెక్షన్‌ ల కింద సీబీఐ క్రిమినల్‌ కేసు నమోదు చేసింది. 2023 నుండి 2018 మధ్య కాలంలో డీకే శివకుమార్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాధించారని సీబీఐ ఆరోపించింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ డీకే శివకుమార్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.




Tags

Read MoreRead Less
Next Story