Karnataka: ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్.. షూట్ హిట్.. జాబ్ ఫట్

Karnataka: ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్.. షూట్ హిట్.. జాబ్ ఫట్
డాక్టర్‌కు షాక్ ఇచ్చిన అధికారులు

ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ లోనే ప్రీవెడ్డింగ్ ఫోటోషూట్ తీసుకున్న ఒక వైద్యుడిని ఉద్యోగం నుంచి తొలిగించిన ఘటన కర్ణాటకలో జరిగింది. కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. భరమసాగర్ ప్రాంతంలోని జిల్లా ఆసుపత్రిలో ఒక కాంట్రాక్ట్ వైద్యుడు వైద్య విధానాల నేపథ్యంతో తన పెళ్లికి ప్రీవెడ్డింగ్ ఫోటో షూట్ చేయించుకున్నాడు. ఆపరేషన్ థియేటర్ లో కాబోయే భార్యతో కలిసి ఒక రోగికి శస్త్ర చికిత్స చేస్తున్నట్టుగా నటిస్తూ వీడియో తీయించాడు. ఆ దృశ్యాలు వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఆపరేషన్ థియేటర్ లో ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించిన డాక్టర్ ను సర్వీస్ నుంచి తొలగించినట్లు... కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండూరావు ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రజల ఆరోగ్యం కోసం ఉందనీ వ్యక్తిగత అవసరాల కోసం కాదని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.

వివాహం అనేది గొప్ప అనుభూతి.. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు తమ పిల్లల పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరిపించేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఇటీవల పెళ్లి వేడుకల చాలా వెరైటీగా జరుపుకుంటున్నారు. ఇందుకోసం భూమి, ఆకాశం, సముద్రం దేన్నీ వదలడం లేదు. నిశ్చితార్థం తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ ఊదరగొడుతున్నారు. రక రకాల ప్రదేశాల్లో రక రకాల ఫోటో షూట్స్,వీడియోస్ తో జనాలకు పిచ్చెక్కిస్తున్నారు. కొంతమంది ఏకంగా సినిమా స్టైల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఓ డాక్టర్ తన ప్రీ వెడ్డింగ్ షూట్ మరీ వెరైటీగా ఉండాలని ప్లాన్ చేశాడు.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారీ మూల్యం చెల్లించుకున్నాడు.

కర్ణాటక భరంసాగర్ ఏరియాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ బేస్ కింద డాక్టర్ తన భాగస్వామితో కలిసి ఆపరేషన్ థియేటర్లో రోగికి ఆపరేషన్ చేస్తున్నట్లు ఫోటోలు, వీడియో తీయించుకున్నాడు. అది కాస్త వైద్యవర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. ఎంతో పవిత్రంగా భావించే వైద్య వృత్తిలో ఇలాంటి పనులు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ థియేటర్ ని వెడ్డింగ్ షూట్ కోసం ప్లాన్ చేయడం వైద్య వృత్తికి కలంకం అంటూ విమర్శిస్తున్నారు.

డాక్టర్ తన భాగస్వామితో ఆపరేషన్ థియేటర్లో తీసుకున్న వెడ్డింగ్ షూట్ ఫోటోలు వైరల్ కావడంతో ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీంతో కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ మంత్రిదినేష్ గుండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వైద్యుడిని తక్షణమే సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేధికగా ప్రకటించారు. ఆస్పత్రులు ఉన్నది ప్రజలకు వైద్యం అందించడానికి.. ఇలాంటి ఎంజాయ్ మెంట్స్ కోసం కాదని ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం అయితే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story