Karnataka Election: సోనియాగాంధీకి ఈసీ షాక్

కర్ణాటక ఎన్నికల పోలింగ్ ముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఈసీ షాక్ ఇచ్చింది. సోనియా చేసిన కర్ణాటక సార్వభౌమాధికారం వ్యాఖ్యలపై కన్నెర్ర జేసింది. బీజేపీ చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. వెంటనే సార్వభౌమత్వం పిలుపుపై వివరణ ఇవ్వాలని ఏఐసీసీ చీఫ్ ఖర్గేను ఆదేశించింది. అంతకుముందు కర్ణాటక సార్వభౌమత్వం పిలుపు కన్నడనాట దుమారం రేపింది.
సోనియా వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన బీజేపీ ఎంపీలు.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసారు. సోనియాగాందీపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ణాటక సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లేలా తమ పార్టీ ఎవరినీ అనుమతించదంటూ సోనియా పేరుతో కాంగ్రెస్ ఇటీవల చేసిన ఓ ట్వీట్ దుమారం రేపింది. వేర్పాటువాదంపై కాంగ్రెస్ పార్టీ బహిరంగ ప్రకటనలు చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com