Karnataka Election 2023 : కర్ణాటకలో ముగిసిన నామినేషన్ల పర్వం

కర్ణాటకలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇకపై ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలనే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో స్టార్ క్యాంపెయి నర్లు సైతం రంగంలోకి దిగుతున్నా రు. మళ్లీ అధికారమే లక్ష్యంగా రంగంలోకి దిగిన బీజేపీ విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది. అందుకు తగిన ప్రణాళిక అమలు చేస్తుంది. బీజేపీ తరపున కర్ణాటకకు రానున్న ప్రధాని మోదీ ఏకంగా పది రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి వచ్చేనెల 8 వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ సమయంలో దాదాపు 20 ర్యాలీ ల్లో, భారీ బహిరం గ సభల్లో పాల్గొనేలా బీజేపీ ప్లాన్ చేసింది.
కర్ణాటక బీజేపీ.. ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రాన్ని ఆరు రిజియన్లుగా విభజించింది. బెలగావి, హుబ్బల్లి నియోజకవర్గం లో ప్రధాని మోదీ, సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రచా రంలో పాల్గొననున్నారు. ఇక జేపీ నడ్డా దాదాపు 25 ర్యాల్లీలో పాల్గొన నున్నారు. ఇది లా ఉండగా.. కర్ణాటకలో మే 10న పోలింగ్ జరుగనుంది. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com