Karnataka: హుక్కా బార్‌లపై త్వరలో నిషేధం

Karnataka: హుక్కా బార్‌లపై త్వరలో నిషేధం
హుక్కా బార్లను నిషేధించేలా చట్టం దిశగా చర్యలు

ప్రజా ఆరోగ్యం దృష్ట్యా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ప్రజలకు అనారోగ్యాన్ని పంచిపెడుతున్న హుక్కా బార్‌లపై త్వరలో నిషేధం విధించాలని యోచిస్తోంది. దీంతోపాటు పొగాకు వినియోగించే చట్టబద్ధమైన వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ప్రకటించారు. 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు యువత హుక్కా బార్లకు వస్తున్నారని, ఈ పొగాకు వినియోగాన్ని అరికట్టేందుకు చట్టం తేవాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు.

ఎన్నో ఏళ్లుగా చర్చనీయాంశమైన హుక్కా బార్ల నిషేధంపై కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నది. కర్ణాటక రాష్ట్రంలో హుక్కా బార్లను నిషేధించేలా చట్టం తీసుకొస్తామని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే నష్టాల నివారణకు సంబంధించి మంగళవారం నిర్వహించిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, యువజన సాధికారత శాఖల ఉన్నతాధికారుల సమావేశం అనంతరం మంత్రి దినేష్ గుండూరావు మాట్లాడారు.హుక్కా బార్లను నిషేధించాలని తీర్మానించామని, కానీ దీని కోసం ప్రత్యేక చట్టం తీసుకురాకపోతే హుక్కా బార్లను నిషేధించినా పెద్దగా ప్రయోజనం ఉండదని. కోర్టులో కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతుందని. అందుకోసం రాష్ట్రంలో హుక్కాబార్ నిషేధానికి ప్రత్యేక చట్టం రూపొందించి అమలు చేస్తామని మంత్రి దినేష్ గుండూరావ్ అన్నారు.


12 ఏళ్ల పిల్లల నుంచి 25 ఏళ్ల యువకుల వరకు హుక్కా బార్లకు వెళ్తున్నారని అన్నారు. ఇవి పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. హుక్కా సేవించే సమయంలో ఎలాంటి పదార్థాలు కలుపుతారో తెలియడం లేదని, అవి పిల్లల్ని అడిక్ట్ అయ్యేలా చేస్తున్నాయి అన్నారు.దీంతో హుక్కా బార్‌లను నిషేధించడంతోపాటు పొగాకు వినియోగించే చట్టబద్ధమైన వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఈ క్రమంలో మంత్రి ప్రకటించారు..

ఇప్పటికే రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో దుమపానం నిషేధించబడింది. కర్నాటక ప్రభుత్వం ఈ చట్టంలో కొన్ని సవరణలు చేసింది, ఇందులో బహిరంగంగా పొగాకు వినియోగాన్ని నిషేధించడం, పొగాకు వినియోగం, సిగరెట్ తాగడంపై నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాను పెంచడం ఉంది.. ఇకపోతే ఆసుపత్రులు, ఆరోగ్య సంస్థలు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలతో పాటు పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించే చట్టాన్ని సవరించాలని ఆరోగ్య మంత్రి దినేష్ గుండురావు సూచించారు…అలా ఎవరైనా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకోవడం చేస్తారని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story