Siddaramaiah: హైకోర్టులో సిద్ధరామయ్యకు ఊరట..

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. సిద్ధరామయ్యపై బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసును న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. 2023 ఎన్నికల సమయంలో ‘‘అవినీతి రేటు కార్డు’’ ప్రకటనపై బీజేపీ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. ఫిర్యాదులో సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ, డీకే శివకుమార్ పేర్లు పొందిపరిచారు. 2023 ఎన్నికల ప్రచారంలో బీజేపీ లంచం తీసుకున్నట్లు ప్రకటనలో కాంగ్రెస్ ఆరోపించింది. తాజాగా దిగువ కోర్టు కార్యకలాపాలను కర్ణాటక హైకోర్టు నిలిపివేసింది. దీంతో ముఖ్యమంత్రికి మధ్యంతర ఉపశమనం లభించింది.
2023 ఎన్నికల సమయంలో పోలింగ్‌కు ముందు రోజు వార్తాపత్రికల్లో కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో పదవులు, కాంట్రాక్టులకు లంచాల రేట్లు నియమించిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ ప్రకటనతో తమ పరువు తీశారని బీజేపీ ధ్వజమెత్తింది. కాంగ్రెస్ ప్రకటనను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య, డీకే.శివకుమార్, రాహుల్‌గాంధీలపై బీజేపీ క్రిమినల్ పరువు నష్టం దావా వేసింది. తాజాగా ఈ కేసును తాత్కాలికంగా ధర్మాసనం నిలిపివేసింది. దీంతో కాంగ్రెస్ నాయకులకు భారీ ఊరట లభించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com