Mahantesh Bilagi: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం చెందారు. కర్ణాటక స్టేట్ మినరల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (KSMCL) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మహంతేశ్ బిళగి (IAS) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళ్తే, కలబురగి జిల్లా గౌనహళ్లి వద్ద మహంతేశ్ బిళగి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆయన ఒక వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు మహంతేశ్‌తో పాటు కారులో ఉన్న ఆయన ఇద్దరు బంధువులు కూడా అక్కడికక్కడే మరణించారు.
ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహంతేశ్ బిళగి మృతి పట్ల వారు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఒకే ప్రమాదంలో ఐఏఎస్ అధికారి సహా ముగ్గురు మృతి చెందడంపై పలువురు ఉన్నతాధికారులు విచారం వ్యక్తం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

