ఎలాన్‌ మస్క్‌కు కర్ణాటక ఆహ్వానం

ఎలాన్‌ మస్క్‌కు కర్ణాటక సర్కార్‌ ఆహ్వానం... పెట్టుబడులకు కర్ణాటక గమ్యస్థానమన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం..

భారత్‌లో పెట్టుబడులు పెడతామని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రకటించగానే.. ఆయనకు కర్ణాటక ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్న కర్ణాటకలో పెట్టుబడులు పెట్టాలని సిద్ధరామయ్య ప్రభుత్వం మస్క్‌ను ఆహ్వానించింది. భారత్‌లో టెస్లా విస్తరణకు కర్ణాటకే అనువైన ప్రాంతమని కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ట్వీట్‌ చేశారు. పెట్టుబడులకు కర్ణాటక ఆదర్శ గమ్యస్థానమని ఆయన మస్క్‌ను కోట్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. కర్నాటకలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని మస్క్‌ భావిస్తే అది తప్పనిసరిగా చాలా మంచి నిర్ణయమని ఆయన అన్నారు. ప్రగతిశీల రాష్ట్రంగా.. ఆవిష్కరణలు, సాంకేతికత కేంద్రంగా ఉన్న కర్ణాటకలో టెస్లా విస్తరణకు అనువైన అన్ని సౌకర్యాలు ఉన్నాయని కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పేర్కొంది. Karnataka invites Elon Muskఅమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేసమైన మస్క్‌... భారత్‌లో పెట్టుబడులు పెడతామని... టెస్లాను విస్తరిస్తామని ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story