Karnataka: రిసెప్షన్ జరుగుతుండగానే కుప్పకూలిన పెళ్లికూతురు.. హఠాత్తుగా..

Karnataka: జీవితంలో మరణం అనేది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఈమధ్య వయసుతో సంబంధం లేకుండా వచ్చే ఆరోగ్య సమస్యలు ఎవ్వరి లైఫ్‌కు గ్యారెంటీ లేకుండా చేసేస్తు్న్నాయి. అప్పటివరకు నవ్వుతూ అందరితో సంతోషంగా గడిపే వ్యక్తి కూడా మరు నిమిషం ఎలా ఉంటారో అర్థం కావడం లేదు. దీనికి ఉదాహరణే కర్నాటకలో జరిగిన ఓ ఘటన.
కర్నాటకలోని శ్రీనివాసపురంకు చెందిన రామప్పకు చైత్ర అనే కుమార్తె ఉంది. తాను కైవార కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుంది. హోసకోటకు చెందిన ఓ వ్యక్తితో చైత్రకు వివాహం నిశ్చయమయ్యింది. పెళ్లితంతు అంతా అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. రిసెప్షన్ జరుగుండగా చైత్ర ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
చైత్రకు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అందుకే ఆమెను వెంటనే బెంగుళూరు నిమ్హాన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరు రోజులు చైత్రను పరీక్షించిన తర్వాత చైత్ర బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. వైద్యులు చెప్పడంతో చైత్ర అవయవాలు దానం చేయడానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com