MBBS విద్యార్థిని.. హాస్టల్ భవనంపై నుంచి దూకి..

కారణాలు చిన్నవే అయినా మనస్థాపం చెందుతున్నారు.. ఆత్మహత్య చేసుకుని నిండు జీవితాన్ని బలి తీసుకుంటున్నారు నేటి యువతీ యువకులు. మెడిసిన్ లో సీటు రావడమే ఎంతో కష్టం.. అయినా సీటు తెచ్చుకుని చదువుకుంటున్న విద్యార్థిని హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ వ్యక్తిగత సమస్యలను సూచిస్తుంది. విద్యార్థిని ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలను అన్వేషించే పనిలో ఉన్నారు పోలీసులు.
ఏజే లేడీస్ హాస్టల్‌లో 20 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం విద్యార్థుల మానసిక స్థితికి అద్దం పడుతోంది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో హాస్టల్ భవనంలోని 6వ అంతస్తు నుంచి దూకి మృతి చెందింది.
ఈ నెల ప్రారంభంలో, ఒడిశాలో 10వ తరగతి విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తరగతి గదిలోకి మొబైల్ ఫోన్ తెచ్చాడని ఉపాధ్యాయుడు మందలించి విద్యార్థి చేతిలో ఉన్న ఫోన్ ను తన దగ్గరే ఉంచుకున్నారు. దాంతో కలత చెందిన విద్యార్థి నవంబర్ 3న చెట్టుకు ఉరి వేసుకుని మరణించాడు.
ఆగస్టులో, కర్ణాటక (ప్రభుత్వ) పాలిటెక్నిక్ (కెపిటి) మొదటి సంవత్సరం విద్యార్థి ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన మొదటి రోజు తన ఖర్చులకు తల్లిదండ్రులు డబ్బు ఇవ్వలేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీకి వెళ్లే సమయంలో తల్లిదండ్రులు ఖర్చుల కోసం రూ.500 ఇవ్వలేదు. దీంతో నిరుత్సాహానికి గురైన సుశాంత్ ఇంట్లోనే ఉండిపోయాడు. తండ్రి బయటకు వెళ్లినప్పుడు, తల్లి వంటగదిలో బిజీగా ఉన్న సమయంలో, అతను తన గదిలోకి వెళ్లి తలుపు బిగించుకున్నాడు.. ఇంటి పై కప్పుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com