Karnataka: రాహుల్‌ గాంధీపై వీడియో.. బీజేపీ నేతపై కేసు

Karnataka: రాహుల్‌ గాంధీపై వీడియో.. బీజేపీ నేతపై కేసు
X
రాహుల్‌ పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని మంత్రిపై మండిపాటు


రాహుల్‌ గాంధీపై యానిమేటెడ్ వీడియో వివాదం ప్రస్తుతం కర్నాటకలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదే అంశంలో బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్ అమిత్ మాల్వియాపై కేసు నమోదు చేశారు పోలీసులు.కర్నాటక కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రాహుల్‌ పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీపై ఓ యానిమేటెడ్‌ వీడియో విడుదల చేసింది బీజేపీ. దీంతో కర్నాటకలో కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా వర్సెస్‌ బీజేపీ సోషల్‌ మీడియాగా మారిపోయింది.

మరోవైపు తాజాగా కాంగ్రెస్‌ రిలీజ్‌ చేసిన ఓ యానిమేటెడ్‌ వీడియో నెటిజన్స్‌ ఆదరణ చురగొంటోంది. బీజేపీ విద్వేష వ్యాపార వీధిని సృష్టిస్తే.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అక్కడ ప్రేమ దుకాణాలను తెరిచి అడ్డుకుంటున్నారని కాంగ్రెస్‌ ఆ యానిమేటెడ్‌ వీడియోలో చూపించింది. పైగా ఈ వీడియోలో మోదీ, అమిత్‌ షాల క్యారెక్టర్లను కూడా చూపించింది.

Tags

Next Story