Karnataka: కర్ణాటకలో ఘోర ప్రమాదం. 17 మంది సజీవ దహనం

క్రిస్మస్ పండగ వేళ కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగినట్టుగానే కర్ణాటకలో కూడా పెను విషాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సును లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు తేరుకునేలోపే మంటలు చుట్టుముట్టేశాయి. దీంతో 17 మంది ప్రయాణికులు సజీదహనం అయినట్లుగా తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. పండగ వేళ ఘోర ప్రమాదం జరగడంతో బంధువులు, కుటుంబ సభ్యులు పెను విషాదంలో మునిగిపోయారు. బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. 9 మంది క్షేమంగా బయటపడినట్లు సమాచారం.
హిరియూర్‌లో గొర్లట్టు దగ్గర ట్రక్కు-బస్సు ఢీకొన్నాయి. ఢీకొట్టగానే బస్సు-లారీలో మంటలు చెలరేగాయి. రెండు కూడా మంటల్లో కాలిపోయాయి. బస్సు గోకర్ణ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులంతా గోకర్ణకు చెందిన వారిగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల్లో కొందరి పేర్లను అధికారులు గుర్తించారు. ఆ వివరాల ప్రకారం.. బస్సులో మంజునాథ్, సంధ్య, శశాంక్, దిలీప్, ప్రీతీశ్వరన్, వి బిందు, కె కవిత, అనిరుధ్ బెనర్జీ, అమృత, కల్పన, ప్రజాపతి, ఎం శశికాంత్, విజయ్ భండారీ, నవ్య, అభిషేక్, హెచ్.కిరణ్‌పాల్, ఎం.కీర్తన్ ఉన్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

