Karnataka: మంత్రి వర్గ కూర్పు కోసం ఢిల్లీకి పయనం
కర్నాటకలో కొత్త మంత్రి వర్గ కూర్పు కోసం సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీ బయలుదేరారు. మరోవైపు సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎల్పీ నేత సిద్ధరామయ్య, AICC ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా, శాసననసభ్యుల బృందం.. గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రేపు మధ్యాహ్నం 12గంటల 30నిమిషాలకు స్థానిక కంఠీరవ క్రీడా మైదానంలో సీఎంగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ మంత్రులుగా మరికొందరు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ను ఆహ్వానించారు.
అటు సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రతిపక్షాలకు చెందిన వివిధ పార్టీల నేతలు తరలివస్తారని సమాచారం. బిహార్ సీఎం నీతీశ్‌కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రేలతో పాటు సీపీఐ, సీపీఎం, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీల నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వాన పత్రాలను పంపించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com