Kashmir Multiplex : కశ్మీర్‌లో కొత్త మల్టీప్లెక్స్.. మొదటి సినిమా ఏంటంటే..

X
By - Sai Gnan |20 Sept 2022 5:15 PM IST
Kashmir Muliplex : కశ్మీర్‌లో ఫస్ట్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
Kashmir Multiplex : కశ్మీర్‌లో ఫస్ట్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. శ్రీనగర్‌లో 520 మంది కెపాసిటీతో ఐనాక్స్ మల్టిప్లెక్స్‌ను తీర్చిదిద్దారు. లాల్ సింగ్ చద్దా స్పెషల్ షో నడిపారు. ఇతర నగరాల్లో ఏ సదుపాయాలున్నాయో...అవే సదుపాయాలు ఇక్కడి ఐనాక్స్‌లోనూ కల్పించారు. ఉగ్రవాదం కారణంగా 90ల్లో ఇక్కడి కశ్మీర్ లోయలో థియేటర్లు మూతపడ్డాయి. అప్పట్లో దాదాపు 15 సినిమా హాల్స్ ఉండేవి.
1999-2000 మధ్యలో సినిమా హాల్స్ తెరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా...అది సఫలం కాలేదు. దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్ సినిమాలను ఇక్కడి ప్రజలు ఎంజాయ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 30న హృతిక్ రోషన్ నటించిన విక్రమ్ వేద సినిమా స్క్రీనింగ్ చేయనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com