Kaun Banega Crorepati: రూ.7 కోట్ల ప్రశ్నకు ఆన్సర్‌ తెలిసినా.. రూ. కోటితో ఆట ఆపేశాడు.

Kaun Banega Crorepati: రూ.7 కోట్ల ప్రశ్నకు ఆన్సర్‌ తెలిసినా.. రూ. కోటితో ఆట ఆపేశాడు.
X
కేబీసీ 16వ సీజన్‌లో రూ.కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్‌ 22 ఏళ్ల చందర్‌ ప్రకాశ్‌

అమితాబ్ బచ్చన్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 16’ ఈ సీజన్‌లో మొదటి కోటీశ్వరుడిని చేసింది. జమ్మూకాశ్మీర్ వాసి చంద్ర ప్రకాష్ కోటి రూపాయల ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి కోటి గెలుచుకున్నాడు. అయితే జాక్‌పాట్ ప్రశ్న, చివరి ప్రశ్నకు సమాధానం అతనికి తెలిసినప్పటికీ, అతను ఖచ్చితంగా తెలియక ఆటను మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. కోటి రూపాయలు గెలుచుకున్న చంద్ర ప్రకాష్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి 16’లో మొదటి కోటి రూపాయలు గెలుచుకున్న కంటెస్టెంట్ అయ్యాడు. చంద్ర ప్రకాష్ వయస్సు కేవలం 22 సంవత్సరాలు. అమితాబ్ బచ్చన్ అతని ఆటతో బాగా ఆకట్టుకున్నాడు.

షో లో బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన కంటెస్టెంట్‌ చందర్‌ ప్రకాశ్‌ రూ.కోటి ప్రశ్నకు చేరుకున్నాడు. ‘‘ఏ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు కానీ.. ‘శాంతి నివాసం’ అనే అరబిక్‌ పేరుతో ఆ నగరం ఓ పోర్టును కలిగి ఉంది’’ అని వ్యాఖ్యాత అమితాబ్‌ ప్రశ్న అడిగారు. దీనికి ఎ. సోమాలియా, బి. ఒమన్‌, సి. టాంజానియా, డి. బ్రూనై నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో చందర్‌ ప్రకాశ్‌ ‘డబుల్ డిప్‌’ లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకుని ఆప్షన్‌ సి. టాంజానియాను ఎంచుకున్నాడు. అది సరైన సమాధానం కావడంతో రూ.కోటి గెలుచుకున్నట్లు బిగ్‌బీ ప్రకటించాడు. వెంటనే షోలో ఉన్నవారంతా చప్పట్లతో అతడిని అభినందించారు. అమితాబ్‌ సీట్లో నుంచి లేచి అతడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. రూ.కోటితో పాటు అతడు ఓ కారును కూడా బహుమతిగా అందుకున్నాడు.

రూ.7కోట్లు ప్రశ్న సమాధానం తెలుసు కానీ..

ఆ తర్వాత చందర్‌ ప్రకాశ్ రూ.7కోట్ల ప్రశ్నకు చేరుకున్నాడు. ‘‘1587లో ఉత్తర అమెరికాలో ఇంగ్లీష్‌ దంపతులను జన్మించిన మొట్టమొదటి బిడ్డ ఎవరు?’’ అని అమితాబ్‌ ప్రశ్నించాడు. దీనికి ప్రకాశ్‌కు జవాబు తెలియకపోవడంతో పాటు అప్పటికే లైఫ్‌లైన్లు అన్ని వినియోగించుకోవడంతో తప్పనిపరిస్థితుల్లో షో నుంచి క్విట్‌ అయ్యాడు. ఆ తర్వాత అమితాబ్‌ సరదాగా ఆ ప్రశ్నకు సమాధానం ఊహించమని అడిగారు. అతడు ఆప్షన్‌ ఎ. వర్జనీయా డేర్‌ అని చెప్పగా.. అదే సరైన జవాబు అని బిగ్‌బీ తెలిపారు.

22 ఏళ్ల ప్రకాశ్ స్వస్థలం జమ్మూకశ్మీర్‌. ప్రస్తుతం యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. చిన్నప్పటి నుంచి తాను ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నానని, పేగులో పూడిక కారణంగా ఇప్పటివరకు ఏడు సార్లు సర్జరీ చేయించుకున్నానని చెప్పాడు.

Tags

Next Story