KCR: నేడు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌తో కేసీఆర్ భేటీ.. థర్డ్ ఫ్రంట్‌పై..

KCR: నేడు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌తో కేసీఆర్ భేటీ.. థర్డ్ ఫ్రంట్‌పై..
KCR: మూడు రోజులుగా ఫ్రంట్ రాజకీయాల్లో భాగంగా ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన సీఎం కేసీఆర్..

KCR: మూడు రోజులుగా ఫ్రంట్ రాజకీయాల్లో భాగంగా ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన సీఎం కేసీఆర్.. ఇవాళ ఝార్ఖండ్ రాజధాని రాంచీకి వెళ్లనున్నారు. సీఎం హేమంత్ సోరేన్‌ను కలిసి ఆయన అధికారిక నివాసంలో గాల్వాన్ అమరుల కుటుంబాలకు పరిహారం అందించనున్నారు. ఇద్దరు అమరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పు చెక్కులు ఇవ్వనున్నారు.

2020 జూన్ 15న చైనాతో ఘర్షణల్లో మనదేశానికి చెందిన 20 మంది సైనికులు వీరోచితంగా పోరాడి అమరులయ్యారు. రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్​బాబు సహా మరో 19 మంది వీరమరణం పొందారు. సంతోష్ బాబుతో పాటు అమరులందరికీ తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. సంతోష్ బాబుకు ఐదు కోట్ల రూపాయలు, మిగతా 19 మంది సైనికుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఆర్థికసాయాన్ని ప్రకటించారు సీఎం కేసీఆర్.

ఇందులో భాగంగానే ఒక్కో బాధితకుటుంబానికి పరిహారం ఇస్తున్నారు. థర్డ్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసిన సీఎం కేసీఆర్.. గురువారం ఢిల్లీలోని ఆయన నివాసంలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్‌ భేటీ అయ్యారు. అక్కడే లంచ్ చేసి 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు.

దేశంలో తాజా పరిస్థితులు, భవిష్యత్‌ రాజకీయాలు, బీజేపీ విధానాలు, ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు, రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వ పరిహారం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న సుబ్రమణ్య స్వామి పదవీ కాలం ఏప్రిల్ 24తో ముగుస్తుంది. ఈ క్రమంలో కేంద్రాన్ని వ్యతిరేకించే కేసీఆర్‌తో ఆయన భేటీ కావటం ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story